Kia Syros: వినూత్న డిజైన్, ఆధునిక ఫీచర్లతో కొత్త కియా సిరోస్..! 3 d ago
వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయనున్న ఈ కొత్త సిరోస్ బి-ఎస్‌యువి గురించి కియా కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. సెల్టోస్ మరియు సోనెట్ మధ్య, ఈ మోడల్‌ను కియా ఇండియా తన ఉత్పత్తి శ్రేణిలో చేరుస్తోంది.
కొత్త కియా సిరోస్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ పవర్‌ట్రెయిన్‌లతో అందించబడుతుంది. పెట్రోల్ వేరియంట్ 118bhp శక్తిని మరియు 172Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, అయితే డీజిల్ ఇంజిన్ 114bhp శక్తి మరియు 250Nm టార్క్‌ను అందిస్తుంది. ఆరు స్పీడ్ మాన్యువల్ గానీ, ఆరు స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ మరియు ఏడు స్పీడ్ DCT యూనిట్‌లు ఎంపికగా అందుబాటులో ఉన్నాయి.
డిజైన్ విషయానికి వస్తే, SYROS 2024లో LED DRLలతో కూడిన ఐస్ క్యూబ్ LED హెడ్‌ల్యాంప్‌లు, L-ఆకారపు LED టైల్‌లైట్లు, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, 17 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు ఉన్నాయి.
కియా సిరోస్ లోపల, సమగ్రమైన ADAS లెవెల్ 2, కొత్త టూ స్పోక్ స్టీరింగ్ వీల్, హర్మాన్ ద్వారా ఎనిమిది-స్పీకర్ సౌండ్ సిస్టం, పనోరమిక్ సన్-రూఫ్, ఆటో-హోల్డ్ ఫీచర్‌తో కూడిన EPB, యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీ కెమెరా, మరియు కియా కనెక్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మరిన్ని ఫీచర్లలో వెంటిలేషన్ మరియు రిక్లైన్ ఫంక్షన్‌లతో కూడిన వెనుక సీట్లు మరియు వైర్‌లెస్ ఛార్జ్‌రు ఉన్నాయి. ఆటో-డిమ్మింగ్ IRVM, ఫోర్-వే పవర్డ్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ Apple CarPlay మరియు Android Auto, డ్రైవ్ మరియు ట్రాక్షన్ మోడ్‌లు, డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్లు ఉన్నాయి. టచ్ ఆధారిత AC నియంత్రణలు, OTA అప్‌డేట్‌లు, ఎయిర్ ఫ్యూరిఫైయర్, డ్యుయల్ కెమెరాతో కూడిన డాష్ క్యామ్, ప్యాడిల్ షిఫ్టర్‌లు, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్.